Home  »  Bollywood News  »  ఫ‌స్ట్ వీకెండ్‌లో 300 కోట్లు టార్గెట్ చేసిన షారుక్ ఖాన్!

Updated : Jan 22, 2023

మన దగ్గర సంక్రాంతి సందడి పూర్తయింది. కానీ బాలీవుడ్‌లో సినిమాల సందడి ఇప్పుడే జోరు అందుకుంటుంది. షారుక్ ఖాన్, దీపిక పదుకొనే, జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించిన సినిమా పఠాన్. ఈ సినిమాను ఈనెల 25న విడుదల చేయనున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రమిది. ఆదిత్య చోప్రా య‌ష్‌రాజ్‌ ఫిల్మ్స్ పథాకంపై తెర‌కెక్కించారు. ఈ సినిమా బిజినెస్ పరంగాను, బజ్‌ పరంగాను వేరే లెవెల్ లో ఉంది. షారుక్ ఖాన్ ఇప్పటిదాకా ఆయన కెరీర్ లో చూడనంతగా వీకెండ్ కలెక్షన్లను ఈ సినిమా రాబడుతుందని బిజినెస్ వర్గాల అంచనా. పఠాన్ సినిమా ప్రీ బుకింగ్ మొదలైంది. ప్రీ సేల్స్ అత్యధికంగా ఎవరు ఊహించని రేంజ్ లో ఉందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ని గమనిస్తే... గతంలో షారుక్ సినిమాలు అన్నిటికన్నా డే వన్ కలెక్షన్లు ప‌ఠాన్‌కి అత్య‌ధికంగా  ఉంటాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

బేషరం పాట విడుదలైన క్షణం నుంచే పఠాన్ మీద నెక్స్ట్  లెవెల్ ఎక్స్‌పెక్టేష‌న్స్ మొదలయ్యాయి. అప్పటి నుంచే ఎప్పుడు ఎప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవుతాయా అనే ఎదురుచూపులు అభిమానుల్లోనూ, సినీ గోయర్స్ లోనూ కనిపించాయి. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్న తీరు చూస్తే ఇండియాలోనే ఇప్పటిదాకా మూడున్న‌ర ల‌క్ష‌ల‌ టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ టిక్కెట్ల సంఖ్య‌ కూడా కొన్ని మల్టీప్లెక్స్ లకు సంబంధించినది మాత్రమే.

వీటన్నిటిని బట్టి చూస్తే పఠాన్ తొలి వారాంతంలో 150 నుంచి 200 కోట్లు రాబడుతుందని అంచనా. ఐదు రోజుల వీకెండ్ లో పూర్తయ్యేసరికి పఠాన్ కలెక్షన్లు 300 కోట్లను దాటే సూచనలు కూడా కనిపిస్తున్నాయని మ‌రికొంద‌రు బిజినెస్ విశ్లేషకుల అభిప్రాయం. పఠాన్ హిందీ తోపాటు దక్షిణాది భాషల్లోనూ అదే రోజు విడుదల కానుంది. గత నాలుగేళ్లుగా సరైన రిలీజ్ లేని షారుక్ ఖాన్ కి బెస్ట్ సినిమాగా ఈ చిత్రం మారనుందంటున్నారు అభిమానులు.  2023 బాలీవుడ్ కలెక్షన్లకు తెరతీయనుంది పఠాన్. అందుకే సౌత్ తో పాటు నార్త్ లోను ఈ సినిమా కలెక్షన్ల గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.